టాప్ 10 వార్తలు



1.హిట్లర్‌ పుస్తకాలు చదివి నియంతలా మారారు: కోదండరాం
హిట్లర్‌ పుస్తకాలు చదివి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా మారారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు.

2.ఇంతకంటే దారుణం ఉంటుందా?

‘దౌర్జన్యాలు, ప్రలోభాలు, ఫోర్జరీ సంతకాలు, బలవంతపు చర్యలతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుని అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఇంతకంటే దారుణం, నీచం మరోటి లేదు. ధైర్యం ఉంటే పోటీలో తలపడి, ప్రజల్ని మెప్పించి గెలవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సవాల్‌ విసిరారు.

3.80 లక్షల ఓట్లు.. 78 సీట్లే లక్ష్యం
తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా శ్రమించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ శివారు కొంపల్లిలో టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లా, బ్లాక్‌, మండల అధ్యక్షులకు డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై రెండు రోజులపాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.


4.ఎన్నికల అధికారి ఉన్నప్పుడు..ప్రత్యేక అధికారి ఎందుకు?

కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు

5.‘సమాజ్‌వాదీ అత్తర్‌’తో సోషలిజం పరిమళిస్తుందట!..

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. హామీలు ప్రకటిస్తూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. ఓటర్లను ఆకట్టుకునే దిశగా విభిన్న ప్రయత్నం చేశారు. ‘సమాజ్‌వాదీ అత్తర్’ పేరిట తయారు చేసిన పెర్ఫ్యూమ్‌లను మంగళవారం విడుదల చేశారు.


6.మాలిక్‌కు కోపమెందుకొచ్చింది..?
‘నాకు తెలుసు.. నేను దిల్లీ నేతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నా. ఒకవేళ వారు పదవి వదులుకోవాలని కోరితే.. ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయను’.. ఈ వ్యాఖ్యలేవో పదవి విషయంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న నేత మాట్లాడుతున్నారనుకుంటే పొరబాటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓ రాష్ట్ర గవర్నర్‌ పలుకులివి. అవసరమైతే పదవికి రాజీనామా చేసి అయినా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడతానని చెబుతున్నారు.

7.200 రోజుల తర్వాత భూమికి వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) 200 రోజులు గడిపిన నలుగురు వ్యోమగాములు తాజాగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో విజయవంతంగా దిగారు. వెంటనే సహాయ సిబ్బంది ప్రత్యేక పడవల్లో ఆ ప్రాంతానికి చేరుకొని వారిని బయటకు తీశారు.

8.మాయాయుద్ధంపై చైనా గురి!
ప్రపంచంపై పెత్తనం చేయాలని ఊవ్విళ్లూరుతున్న చైనా.. అందుకు అనుగుణంగా వినూత్న ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. శత్రు రాడార్ల కళ్లుగప్పే స్టెల్త్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన యుద్ధవిమానాలను సిద్ధం చేసుకుంటోంది. అంతేకాకుండా ఇప్పటికే తయారైన జెట్‌లను అదనపు హంగులతో మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతోంది.

9.ఆరోగ్య బీమాకు జీఎస్‌టీ సుస్తీ
చిన్న అనారోగ్యానికీ రూ.లక్షల్లో ఖర్చవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా అవసరం ఎంతో పెరిగింది. కొవిడ్‌-19 తర్వాత క్లెయింలు ఒక్కసారిగా పెరగడంతో పాలసీ సంస్థలకు భారంగా మారింది. ఆరోగ్య బీమాపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 18శాతం వరకు చెల్లించాల్సి రావడం పాలసీదార్లకు కష్టమవుతోంది. ఈ భారం వల్లే మధ్య తరగతి ఆదాయ వర్గాలు, విశ్రాంత ఉద్యోగులకు తక్కువ మొత్తం వైద్యబీమా పాలసీలకు పరిమితమవుతున్నారు.

10.రోహిత్‌కే పగ్గాలు

ఊహించినట్లే టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథ్యం రోహిత్‌శర్మను వరించింది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకోవడంతో బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ ప్రస్థానం ప్రారంభంకానుంది. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మ అందుబాటులో ఉన్నప్పుడు కెప్టెన్‌గా మరొకరి గురించి ఆలోచించే పరిస్థితే లేదు.

Post a Comment

أحدث أقدم