చికెన్‌ కి పురుగులు.. మరి మటన్ కి...!

TS News: మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు

 పురుగులు పట్టిన మాంసం, పదార్థాలు

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: ఓ హోటల్‌ నిర్వాహకుడు రోజుల తరబడి నిల్వ ఉంచిన, పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బండ్లగూడజాగీర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వెలుగు చూసింది. బండ్లగూడజాగీర్‌ కూడలిలోని పెట్రోలు బంకు పక్కన ‘జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టు’ రెస్టారెంట్‌ ఉంది. మంగళవారం నగరపాలక సంస్థ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరిశెట్టి మనోహర్‌, స్థానిక తెరాస నాయకుడు మద్దెల ప్రేంగౌడ్‌, మరికొంతమంది స్థానికులు రెస్టారెంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో బూజుపట్టిన మాంసం, పురుగులు పట్టిన చికెన్‌ దర్శనమిచ్చాయి. రెండు రోజుల కిందటి బిర్యానీని తిరిగి వేడి చేసి పెడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరిశెట్టి మనోహర్‌ వాటిని నాణ్యత పరిశీలన కోసం సేకరించారు. హోటల్‌ నిర్వాహకుడిపై అక్కడికక్కడే రూ.5వేల జరిమానా విధించారు.



Post a Comment

أحدث أقدم