యువతిని రైలు కిందకు తోసేందుకు యత్నం


యువతిని రైలు కిందకు తోసేందుకు యత్నం.. 

ముంబయి: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిని రైలు కిందకు నెట్టేందుకు యత్నించిన ఘటన  ముంబయిలో జరిగింది. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. వడాలా నివాసి సుమేథి జాదవ్‌, యువతి గతంలో ఒకే చోట పనిచేసినప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, జాదవ్‌ మద్యానికి బానిసయ్యాడని తెలుసుకున్న యువతి అతడ్ని దూరం పెట్టింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని యువతిని అతడు వేధించడం మొదలుపెట్టాడు. అంథేరిలో యువతి రైలు ఎక్కగా ..జాదవ్‌ ఆమెను వెంబడించాడు. యువతి తల్లికి ఫోన్‌ చేయగా ఆమె కార్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. మరోసారి యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జాదవ్‌ లోకల్‌ రైలు వచ్చే సమయంలో ఆమెను రైలుకిందకు తోసేందుకు ప్రయత్నించాడు. యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో యువతి తలకు గాయమైంది. వెంటనే జాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాదవ్‌ను అరెస్టు చేశారు.

Post a Comment

أحدث أقدم