వయ్యారాలు కాదు.. ఎముకలు విరగ్గొడతా..మాజీ మంత్రిపై నటి ఆగ్రహం




ముంబయి: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మరోసారి వైరల్‌ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఓ మాజీ మంత్రిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నటి ఘాటుగా సమాధానమిచ్చారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ పన్సే మాట్లాడుతూ.. కంగనా రనౌత్‌ గురించి స్పందించారు. రికార్డింగ్‌ డ్యాన్సర్‌ అనే అర్థం వచ్చేలా ఆమెపై కామెంట్‌ చేశారు.

కాగా, సుఖ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కంగన స్పందించారు. దీపికా పదుకొణె, ఆలియాభట్‌ లాంటి హీరోయిన్‌ని తాను కాదని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఇంతకీ నాపై వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తి ఎవరు? కత్రినా కైఫ్‌, దీపికా పదుకొణె, ఆలియాభట్‌ లాంటి వ్యక్తి కాదని ఇతనికి తెలుసా? ఐటమ్‌సాంగ్స్‌ చేయని ఒకే ఒక్క హీరోయిన్‌ని.. బడా హీరోల సినిమాలను సైతం తిరస్కరించిన కథానాయికని నేను. వీటివల్ల బాలీవుడ్‌లో ఉన్న ఎంతోమంది నటీనటులు నాపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక రాజ్‌పుత్‌ మహిళను. వయ్యారాలు వొలికించను.. కేవలం ఎముకలు విరగ్గొడతాను..’ అని కంగన ఘాటుగా సమాధానమిచ్చారు.

Post a Comment

أحدث أقدم