కోటి బంగారంతో వెళ్తూ వ్యాపారుల మృతి




రామగుండం: కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యాపారులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రామగుండం రాజీవ్‌ రహదారిపై మల్యాలపల్లి మూలమలుపు వద్ద  కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్‌, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ఉన్న సంతోష్‌ కుమార్‌, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని వివిధ బంగారు దుకాణాలకు బంగారం విక్రయిస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు వీరి వద్ద  కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. 

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఘటనా స్థలికి వచ్చిన గోదావరిఖని 108 సిబ్బంది బంగారు ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్‌ఐ శైలజకు  అప్పగించారు. నిజాయితీగా బంగారు ఆభరణాలు అప్పగించిన 108 సిబ్బందిని పోలీసులు అభినందించారు.

రూ.కోటి బంగారంతో వెళ్తూ వ్యాపారుల మృతి


Post a Comment

أحدث أقدم