వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు


రాయ్‌పూర్‌ : ఓ వ్యక్తి ఇద్దరు యువతుల వివాహ ఉదంతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బస్తర్ జిల్లాలోని జగదల్పూర్‌ సమీపంలో ఉన్న 'తిక్రాలొహంగా' అనే గ్రామంలో ఇటీవల వివాహం జరిగింది. వివాహం జరిగితే వింతేముంది అనుకుంటున్నారా? వింతే మరి. ఒక వరుడు, ఇద్దరు వధువులు. ఒకే కళ్యాణ మండపంలో ఇద్దరు యువతులకు తాళి కట్టి 7 అడుగులు వేశారు. వరుడి పేరు చందు మౌర్య, వధువులు హసీనా (19), (సుందరి) 21. వీరిద్దరూ ఇంటర్‌ వరకు చదవివారు. వరుడికి గతంలో ఈ ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయం వచ్చే సరిగి వరుడికి ఎవరిని వదులుకోవాలో తట్టలేదు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడుకుని ఇద్దరి యువతుల్ని వివాహం చేసుకున్నారు.


వీరి పెళ్లికి గ్రామ పెద్దలందరూ అంగీకారం తెలిపారు.  ఒకే వేదికపై ఒక యువకుడు ఇద్దరు యువతులతో వివాదం చేసుకోవటం ఛత్తీస్గఢ్ లో మొదటి ఘటనగా స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి సంబంధించిన  ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే రెండో వివాహం తమ ఆచారమని *ఇందులో వింతేముందని గిరిజనులు అనటం కొసమెరుపు.


Post a Comment

أحدث أقدم