నేటి ముఖ్యమైన వార్తలు


మత విద్వేషాలకు భారీ కుట్ర
అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. 

మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు
లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే మధ్యతరగతి ప్రజల్లో ఆందోళనలు, భయాలు ఉండవు. వివాదాలు లేకుండా,  క్లియర్‌ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలను ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా లాటరీ  పద్ధతిలో కేటాయిస్తుంది. తద్వారా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలి. 

అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్‌ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. 

120 నాటుకోళ్లు మృతి..బర్డ్‌ ఫ్లూ అనుమానం
వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గద్ద సారయ్యకు చెందిన 120 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లను మండల పశువైద్యాధికారి మాలతి పరిశీలించారు.

26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్‌) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్‌ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 

ట్రంప్‌ని గడువుకు ముందే తప్పిస్తారా?
 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది.  ట్రంప్‌ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్‌ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి.

2020: బాలీవుడ్‌ చెత్త సినిమాలు ఇవే
బాలీవుడ్‌లో హిట్‌ వస్తే ఎంత పేరు వస్తుందో ఫ్లాప్‌ వస్తే అంత రిపేరు కూడా వస్తుంది. హిట్‌ అవుతుందని ప్రేక్షకుల మీదకు వదిలిన సినిమాలు బొక్కబోర్లా పడే సన్నివేశాలు ప్రతి సంవత్సరంలో ఉంటాయి. బాలీవుడ్‌లో 2020లో అతి చెత్త ఐ.ఎం.డి.బి రేటింగ్స్‌ పొందిన సినిమాలుగా ఆరు సినిమాలు తేలాయి. 

మోటార్‌ సైక్లిస్టు సంతోష్‌కు ప్రమాదం
భారత ప్రముఖ మోటార్‌ సైక్లిస్టు, హీరో మోటో స్పోర్ట్స్‌ రేసర్‌ సీఎస్‌ సంతోష్‌ బుధవారం ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతోన్న డాకర్‌ ర్యాలీ మోటార్‌ రేసు సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. రేసులో భాగంగా కంకరతో కూడిన ట్రాక్‌పై 135 కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న 37 ఏళ్ల సంతోష్‌ అదుపుతప్పి పడిపోయాడు. 

చివర్లో అమ్మకాలు
చివరిగంట అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 81 పాయింట్లను కోల్పోయి 48,093 వద్ద సిర్థపడింది. నిఫ్టీ 9 పాయింట్లను కోల్పోయి 14,137 వద్ద నిలిచింది. నిఫ్టీ వీఎఫ్‌ఎక్స్‌ ఇండెక్స్‌ 2 శాతం పెరిగింది. ఇది మార్కెట్లో అస్థిరతను సూచిస్తుంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో సూచీలు ఉదయం లాభాలన్నీ హరించుకుపోయాయి. 

వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్‌’
ఇండోనేషియాలో భూమధ్య రేఖ మీద ఎనిమిది డిగ్రీల దగ్గర లంబాక్‌ – జావా దీవుల మధ్య కేంద్రీకృతమై ఉంది బాలి ద్వీపం. ప్రపందవాసులంతా ఆనందంగా జనవరి 1, 2021 ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఈ తీరవాసులు మాత్రం అందుకు విరుద్ధంగా కొంచెం బాధలో మునిగి ఉన్నారు. బాలిలో ప్రసిద్ధి చెందిన కుటా సముద్ర తీరమంతా టన్నులకొలదీ వ్యర్థాలతో నిండిపోయింది. 

Post a Comment

أحدث أقدم