వృద్ధుడిని చేరదీసిన ఎస్సై కుమారులకు కౌన్సెలింగ్
పాలకుర్తి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారానికి చెందిన బండి యాకయ్య వృద్ధ్యాప్యంలో ఏ ఆసరా లేక, తోడు లేక మంగళవారం పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌కు చేరారు. నడవడం చేతకాకున్న భూమిపై పాకుతూ వచ్చారు. ఆయన్ను చూసిన పోలీసులు ఎస్సై సతీశ్‌కు సమాచారమివ్వగా ఆయన చేయూతనందించారు. తక్షణమే అల్పాహారం పెట్టించారు. అంతేకాక గ్రామస్థులకు చెప్పి అతని కుమారులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ వయసులో మంచిగా చూసుకోవాలని, ఏ దిక్కు లేకుండా ఇలా వదిలేయడం సరికాదని మందలించారు. అనంతరం మధ్యాహ్యం భోజనం కూడా పెట్టించి రూ.200 అందజేశారు. ఈ దృశ్యాన్ని చూసి పోలీసుస్టేషన్‌కు వచ్చిన పలువురు ఎస్సైని అభినందించారు.