1.మేడ్ ఇన్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే.. ఔషధ, ఐటీ, వైమానిక, రక్షణ, సేవా రంగాల్లో కీలకంగా ఉంది. కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగానికీ గమ్యస్థానంగా మారుతోంది. సెల్‌ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకూ వస్తువులను గతంలో దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తూ.. దేశవిదేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. ముఖ్యంగా అత్యంత డిమాండ్ ఉన్న సెల్‌ఫోన్ల తయారీ హబ్‌గా రాష్ట్రం ఎదుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు, జాతీయ, స్థానిక సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఈ రంగంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులను ప్రారంభించాయి.
2. నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు బుధవారం నుంచి ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు https://oamdc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ చదివిన విద్యార్థులు హాల్‌టిక్కెట్ నంబరు నమోదు చేసి, తల్లిదండ్రుల వివరాలను సమర్పిస్తే సరిపోతుంది.
3. పదిలో సగం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు?
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై రకరకాల మార్గాలను వెతుకుతోంది. విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను పెంచడం, అర మార్కు బదులు ఒక మార్కు కేటాయించడం, వివరణాత్మక ప్రశ్నల్లో ఛాయిస్ అధికంగా ఇవ్వడం, ప్రశ్నల సంఖ్యను కుదించడం లాంటి పలు ప్రత్యామ్నాయాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
4. కుట్లు వేసే దారమూ కరవే..!
సామగ్రి అందుబాటులో లేక హైదరాబాద్‌లోని ప్రభుత్వ చిన్న పిల్లల ఆసుపత్రి నిలోఫర్‌లో మూడు రోజులుగా శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్వయంగా విభాగాధిపతి(సర్జికల్ హెచ్‌ఓడీ) డాక్టర్ నరేంద్రకుమార్ పిల్లల తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది.
5.మీ పిల్లల్లో ఏముంది?
మారుతున్న కాలం.. తల్లిదండ్రుల్లో అవగాహన లేమి.. చుట్టు పక్కల పిల్లలతో సత్సంబంధాలు లేకపోవడం.. అభిరుచిని గుర్తించి ప్రోత్సహించకపోవడం వంటి కారణాలతో చిన్నారుల్లో సామాజిక, సాంకేతిక నైపుణ్యాలు కొరవడుతున్నాయి. పది.. ఇంటర్.. ఆ తర్వాత ఇంజినీరింగ్, మెడిసన్. ఆ తర్వాత మంచి ఉద్యోగం.. లేకుంటే విదేశాలకు వెళ్తే తమ పిల్లల భవిష్యత్తు పరిపూర్ణమైనట్టు భావిస్తున్న తల్లిదండ్రుల మారాల్సిన సమయం వచ్చింది. బాల్యం నుంచే చిన్నారుల బుర్రలకు పదను పెడితే అద్భుతాలు సృష్టిస్తారు.
6. బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైన రాష్ట్రాలు
బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక, తమిళనాడు, జమ్మూ-కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలు అటవీ, పశు సంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు బర్డ్‌ఫ్లూతో మృతి చెందాయి. దీంతో ఈ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించి కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
7. ‘స్థలం మీది.. టవర్ మాది.. లాభం మీకే’
‘‘మీ ఇంటి పైకప్పు విశాలంగా ఉందా?.. మీకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఖాళీ స్థలాలున్నాయా?.. మీకు నెలకు రూ.వేలల్లో ఆదాయం వస్తుంది. మా కంపెనీ సెల్‌ఫోన్ టవర్‌ను ఏర్పాటు చేస్తాం.. మీ ఖాతాలో నెలనెలా నగదు జమ చేస్తాం.. మాతో మీరు భాగస్వామ్యులయ్యారన్న విషయాన్ని ఖరారు చేసుకునేందుకు ఖాతాలో రూ.10 వేలు జమ చేయండి.’’-సైబర్ నేరస్థులు ఎంచుకున్న కొత్త ఎత్తుగడ ఇది. నేరస్థులు కొద్దిరోజుల నుంచి ఐడియా-వొడాఫోన్, ఎయిర్‌టెల్, జియో సంస్థలు టవర్లను పెంచుతున్న సమాచారం తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
8. ట్రాన్స్‌జెండర్లు ‘మహిళా విభాగం’కింద పోటీ చేయొచ్చు
మహారాష్ట్రలోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ‘మహిళా విభాగం’ నుంచి పోటీ చేసేందుకు ఓ ట్రాన్స్‌జెండర్‌కు బాంబే హైకోర్టు (ఔరంగాబాద్ బెంచ్) అనుమతి ఇచ్చింది. జల్గావ్ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి మహిళా విభాగం కింద దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో ట్రాన్స్‌జెండర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
9. ఇదే మంచి తరుణం
ఓటమి తర్వాత పుంజుకోవడం ఎంత ముఖ్యమో విజయం తర్వాత అప్రమత్తంగా ఉండటం అంతే ముఖ్యం. అడిలైడ్ షాక్ తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటే.. కోహ్లి లేని భారత జట్టును తక్కువగా అంచనా వేసి బోల్తా కొట్టింది ఆసీస్. ఇప్పుడు ఇరు జట్లూ సమాన స్థితిలో ఉన్నాయి. తొలి టెస్టు తర్వాత ఆసీస్‌లా విజయాన్ని తలకెక్కించుకోకుండా తీవ్రత కొనసాగిస్తూ ఆతిథ్య జట్టును మరో దెబ్బ కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లడం టీమ్‌ఇండియా ముందున్న కర్తవ్యం. ఆస్ట్రేలియాలో భారత్‌కు కొంచెం అనుకూలంగా ఉండే వేదికైన సిడ్నీలో ఈ మ్యాచ్ జరగబోతుండటం కలిసొచ్చే అంశం.
10. వారికి ఇక ఎన్నికలే
ఎన్నికల్లో పోటీ చేయడంతో బాధ్యత తీరిపోదు. ఎన్నికల ఖర్చుల తాలూకూ లెక్కలు చెబితేనే ఆ ప్రక్రియ ముగిసినట్లు. ఆ..ఏముందిలే! ఎవరొచ్చి అడుగుతారులే! అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అలాంటి భావనతో ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని ఫలితంగా తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన 40 వేల మందికిపైగా అభ్యర్థులపై అనర్హత వేటుపడింది. వీరిలో గెలిచిన వారు పదవులు కోల్పోతుండగా, ఓడిన వారు మూడేళ్లపాటు అనర్హతతో ఎన్నికలకు దూరం కానున్నారు