చికిత్స పొందుతున్న గీత
చిన్నకడబూరు (పెద్దకడబూరు), న్యూస్‌టుడే: ఓ అత్త కోడలిపై వేడి టీ చల్లడంతో గాయాలపాలైన ఘటన మంగళవారం పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లప్ప, ఎల్లమ్మ కుమార్తె గీతకు అదే గ్రామానికి చెందిన బోయ అంజినయ్య, నర్సమ్మ కుమారుడు రామాంజితో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం గీత గర్భిణి. నిత్యం అత్త, మామ, భర్త వేధింపులకు గురిచేస్తున్నారని గీత తెలిపినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం అత్త గీతతో గొడవపడి చేతిలో ఉన్న టీ చల్లడంతో గీత గాయాలపాలైనట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.