కొనుగోలు కోసం జనం బారులు
పోలీసు బందోబస్తుతో అమ్మకాలు
నల్గొండ జిల్లాలోని శాలిగౌరారంలో ఆదివారమంతా చేపల వేట, అమ్మకాలతో సందడిగా మారింది. ఈ ప్రాజెక్టు రైతులతోపాటు వందల మంది మత్స్యకార్మికులకూ జీవనాధారం. ఇది నిండిన ప్రతిసారి ఆయకట్టు కింద సుమారు 8,000 ఎకరాలకు సాగునీరందించడంతో పాటు చేపల పెంపకానికి ఉపయోగపడుతోంది. కొవిడ్ కారణంగా కొన్ని నెలలుగా ఇందులో చేపలు పట్టలేదు. ఆదివారం మత్స్య కార్మికులు చేపల వేట ప్రారంభించారు. పెద్దపెద్ద చేపలు భారీగా దొరకడంతో మత్స్యకారుల పంట పండింది. మండలంలోని అనేక గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి బారులు తీరి చేపలను కొనుక్కుని వెళ్లారు. ఏకంగా 60 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది.