రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా

 


చెన్నై/ టీనగర్: చట్టానికి కళ్లు లేవు అనేది పాత సామెత. అయితే కామానికి కళ్లు లేవు అంటూ ఈ కలికాలంలో కొందరు నిరూపిస్తున్నారు. వదిన అంటే తల్లితో సమానం. అలాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ యువకుడు. రాత్రి భర్త, పగలు మరిదితో వన్స్ మోర్ అంటూ ఊపేసింది. మస్త్ మస్త్ గా ఒళ్లంతా మడతపెట్టి మసాజ్ చేస్తున్న మరిదితో వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ వదిన సంవత్సరం పాటు సరసాలు ఆడింది. కట్టుకున్న భార్యకు, సొంత తమ్ముడికి బుద్దిమాటలు చెప్పిన అన్న విసిగిపోవడం, అదే సమయంలో ఇంటింటి రామాయణం లాగా వదిన, మరది భాగోతం అందరికి తెలిసిపోవడంతో అన్న బయట తిరగడానికి వెనుకడుగు వేశాడు. రోజూ ఇదే పంచాయితీ అంటూ విరక్తి చెందిన అన్న ఏక్ మార్ తీన్ తుకుడా అంటూ తమ్ముడిని అడ్డంగా లేపేయంతో కలకలం రేపింది.

మొదట ముహూర్తం బాగాలేదు

చెన్నై సిటీలోని మైలాపూర్ లోని లాలా ఎస్టేట్ లో నివాసం ఉంటున్న పళని సొంతంగా ఆటో తీసుకుని నడుపుకుంటున్నాడు. పళనికి గతంలో వివాహం అయ్యింది. తరువాత పళని మరియాల్ (32) అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పళనికి మొదటి భార్యతో గొడవలు ఎక్కువ అయ్యాయి. పళని మొదటి భార్య నాలుగు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుంది.

మస్త్ మస్త్ మరియాల్

పళని రెండో భార్య మరియాల్ తో కాపురం ఉంటున్నాడు. పళని, మరియాల్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉదయం నిద్రలేచి ఆటో తీసుకుని బయటకు వెలుతున్న పళని రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెలుతున్నాడు. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని మరియాల్ మేడమ్ కు కోరికలు చాలా ఎక్కువ. ఇదే విషయంలో రెండో భార్య మరియాల్ తో పళనికి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి.


నువ్వు అదుర్స్..... వన్స్ మోర్

పళని సోదరుడు సెంథిల్ (32) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో సెంథిల్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం మంచిదే అయినా సెంథిల్ బుద్దిమాత్రం చిన్నది. నిత్యం అన్న పళనితో గొడవలు పెట్టుకుంటున్న వదిన మరియాల్ తో సెంథిల్ ఏడాది నుంచి సన్నిహితంగా మెలిగాడు. భర్త పళని బయటకు వెళ్లిన తరువాత వదిన మరియాల్ వన్స్ మోర్.... వన్స్ మోర్ అంటూ మరిది సెంథిల్ తో సరసాలు ఆడటం మొదలుపెట్టింది

మితిమీరిపోయిన సరసాలు

వదిన మరియాల్, మరిది సెంథిల్ వ్యహహారం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. నీకేం పోయేకాలం వచ్చింది, మరిదితో నీకు అక్రమ సంబంధం ఏమిటి ? అంటూ భర్త పళని భార్య మరియాల్ మీద మండిపడ్డాడు. కుటుంబ సభ్యులు సైతం మరియాల్, సెంథిల్ కు బుద్దిమాటలు చెప్పారు. కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు సైతం మరియాల్, సెంథిల్ కు ఏడాది నుంచి పదేపదే బుధ్దిమాటలు చెబుతూనే ఉన్నారు.


చితకబాదినా చీమకుట్టినట్లు లేదు

ఎంతమంది ఎన్ని బుధ్దిమాటలు చెప్పినా కుక్క తోక వంకర అనే సామెత లాగా మరియాల్, సెంథిల్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. తరువాత వదిన మరియాల్, మరిది సెంథిల్ మరింత రెచ్చిపోయారు. భార్య మరియాల్, తమ్ముడు సెంథిల్ వ్యవహారం సృతిమించిపోవడంతో పళని ఇద్దరిని అనేకసార్లు చితకబాదేశాడు. అయినా మరియాల్, సెంథిల్ కు చీమకుట్టినట్లు కూడా లేకుండా వారిదారిలో వాళ్లు టైమ్ చిక్కినప్పుడు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.

దెబ్బకు తమ్ముడు ఫినిష్

రాత్రి పళని బయట ఉన్న సమయంలో వదిన మరియాల్, మరిది సెంథిల్ ఇంట్లో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇద్దరి టైమ్ బాగాలేకపోవడంతో బయట నుంచి పళని పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ఇద్దరిని ఆ సీన్ లో చూసిన పళని రెచ్చిపోయాడు. అంతే ఆటో ఉన్న ఇనుపరాడ్ తీసుకు వచ్చి ఇద్దరి మీద దాడి చేశాడు. తమ్ముడు సెంథిల్ తప్పిచుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో రోడ్డు మీద వెంటాడని పళని అతన్ని తల మీద రాడ్ తో దాడి చేశాడు. కిందపడిన తమ్ముడు సెంథిల్ తలపై సమీపంలో ఉన్న సిమెంట్ ఇటుక తీసుకు వచ్చి దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

చేతులు ఎత్తేసిన కిలాడీ లేడీ

తమ్ముడు సెంథిల్ ని హత్య చేసిన పళని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న మైలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంత జరిగినా వదిన మరియాల్ ఇది అన్న, తమ్ముడి వ్యవహారం, తనకు ఎలాంటి సంబంధం లేదని డైలాగులు చెప్పింది. అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురికావడంతో లాలా ఎస్టేట్ లో కలకం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే పళనిని అరెస్టు చేశారు. సార్ రోజు బుద్దిమాటలు చెప్పిచెప్పి విసిగిపోయానని, సంవత్సరం నుంచి రోజు ఇదే పంచాయితీ అయిపోయిందని, ఒకర్ని లేపేస్తే ఓ పనైపోతుందని ఇలా చేశానని పళని మైలాపూర్ పోలీసులకు చెప్పడంతో కథ క్లైమాక్స్ కు చేరుకుంది.

Post a Comment

أحدث أقدم