మారుతున్న కాలానికి అనుణంగా దొంగలు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుపడకుండా జాగ్రత్త పడుతూ.. నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు. జైపూర్ మండలం ఇందారంలోని టేకుమట్ల ఎక్స్‌రోడ్డు సమీపంలో రెండు రోజులుగా ఓ లారీ నిలిపి ఉంటోంది. సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో దుండగులు దొంగిలించి ఇక్కడ నిలిపివేసి ఉంటారని వాహన చోదకులు అభిప్రాయపడుతున్నారు. లారీ తీసుకువచ్చిన దొంగలు కేవలం దాని చక్రాల(టైర్లు)ను మాత్రమే ఎత్తుకెళ్లి వాహనాన్ని అలాగే వదిలిపెట్టారు. దాని ఆనవాళ్లు తెలియకుండా నంబర్‌ప్లేట్‌ను సైతం మార్చినట్లు తెలుస్తోంది.
చాకచక్యం.. చక్రాలు మాయం
AMARAVATHI NEWS WORLD
0