ప్రేమను కాదందని వివరాలు డేటింగ్‌ సైట్‌లో పెట్టాడు


ప్రేమను కాదందని వివరాలు డేటింగ్‌ సైట్‌లో పెట్టాడు

 హైదరాబాద్‌: నగర శివారుల్లోని ఓకళాశాలలో చదువుతున్న యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్‌ వస్తున్నాయి. అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు స్నేహితుడే ఆ యువతిని ‘కాల్‌గర్ల్‌’గా ప్రచారం చేసినట్లు తేల్చారు. కింగ్‌కోఠికి చెందిన మహ్మద్‌ సమీర్‌(25), బాధితురాలు మూడు నెలల కిందట కళాశాలలో ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్నాళ్లకు సమీర్‌ తన ప్రేమను ఆమెతో వ్యక్తపరిచాడు. యువతి తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో అసభ్యకరమైన ఫొటోలను అప్‌లోడ్‌ చేసి.. ఆ చిత్రాల కింద బాధితురాలి ఫోన్‌ నంబరు, వివరాలు ఇచ్చాడు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

أحدث أقدم