తన ఆరోగ్య పరిస్థితి పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

2020 వ సంవత్సరం ప్రజలను కరోనా మహమ్మారి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ మహమ్మారి ధాటి నుండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా జనాలు తప్పించుకోలేక ఉన్నారు, సుమారు 8 నెలల నుండి పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది అని అందరూ ఆనందించేలోపే కొత్త రకం కరోనా ప్రపంచం లోకి అడుగు పెట్టి గడగడగలాడిస్తుంది,ఈ కొత్త రకం కరోనా మాములు కరోనా వైరస్ కంటే పది రేట్లు ఎక్కువ వేగం తో వ్యాప్తి చెందుతుంది అట, బ్రిటన్ లో పుట్టిన ఈ కొత్త రకం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపడుతూ ఇప్పటికే మన భారత దేశ ప్రభుత్వం బ్రిటన్ నుండి వచ్చే విమానాలు ఆపి వేసింది, ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మ్మారీ సోకి ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రాణాలు విడిచిన సంగతి మన అందరికి తెలిసిందే, కొంతమంది అయితే తీవ్ర స్థాయిలోకి వెళ్లి కూడా ప్రాణాలతో బయట పడ్డారు,తాజా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా భారిన పడ్డారు,కరోనా తాలూకు లక్షణాలు ఏమి లేకపోయినా కూడా టెస్ట్ లో పాజిటివ్ ఫలితం రావడంతో ఆయన క్వారంటైన్ అయ్యి చికిత్స పొందుతున్నారు.

 

ఇది ఇలా ఉండగా ఇటీవల మెగా కుటుంబం మొత్తం ఒక్క చోట కలుసుకొని క్రిస్మస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు, ఈ వేడుకకి రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , నిహారిక కొణిదెల ఇలా మెగా ఫామిలీ కి సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరు అయ్యి పెద్ద పార్టీ చేసుకున్నారు, ఈ పార్టీ లోనే రామ్ చరణ్ కి కరోనా సోకినట్లు తెలుస్తోంది, రామ్ చరణ్ తో పాటు నిన్న వరుణ్ తేజ్ కూడా తనకి కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, దీనితో ఒక్కసారిగా ఆరోజు పార్టీ కి హాజరు అయినా వాళ్ళందరూ కరోనా టెస్టింగ్స్ చేయించుకున్నారు, దాని తాలూకు ఫలితాలు రావాక్సి ఉంది, ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, కుటుంబం తో కంటే ఎక్కువ సమయం ఆయన ఆర్ ఆర్ ఆర్ టీం తోనే గడుపుతుండడం తో జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి తో పాటు గత వారం రోజుల నుండి నాతో ఉంటున్న ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి అంటూ రామ్ చరణ్ ప్రకటించాడు.

ఇక రామ్ చరణ్ కి కరోనా సోకింది అని తెలియడం తో యావత్తు సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ఆయన త్వరగా కోలుకోవాలి అని ఇండస్ట్రీ కి చెందిన వారందరు ట్విట్టర్ లో రామ్ చరణ్ ని టాగ్ చేస్తూ ప్రార్థనలు చేసారు, రామ్ చరణ్ తనని తొందరగా కోలుకోవాలి అని కోరుకున్న ప్రతి ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీ కి మరియు అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపాడు, ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ కి కరోనా తాలూకు లక్షణాలు విపరీతంగా ఏమి లేవు అని, మాములు మెడికేషన్ ద్వారానే ఆయన కోలుకోగలడు అని, అభిమానులు ఏ మాత్రం కంగారు పడొద్దు అని డాక్టర్లు తెలపడం తో అభిమానులు కాస్త కుదుటపడ్డారు, కరోనా లాక్ డౌన్ తర్వాత శరవేగంగా దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం రామ్ చరణ్ కి కరోనా వచ్చింది అనే వార్త రావడం తో షూటింగ్ కార్యక్రమాలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయింది, రామ్ చరణ్ త్వరగా కరోనా భారీ నుండి కోలుకొని మన ముందుకి చాలా తొందరగా రావాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని మనం కోరుకుందాము.

Post a Comment

أحدث أقدم