అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి

ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. భండారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో చిన్నపిల్లల అత్యవసర విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న పది మంది మరణించారు. మరో ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post