ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. భండారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో చిన్నపిల్లల అత్యవసర విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న పది మంది మరణించారు. మరో ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి
AMARAVATHI NEWS WORLD
0