108 వాహనం ఢీకొని వ్యక్తి మృతి


108 వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నందిగామ: రోడ్డు దాడుతుండగా 108 వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. బోర్‌ వెల్‌ కంపెనీలో పనిచేయడానికి ఆదివారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఓ వ్యక్తి నందిగామకు వచ్చాడు. సోమవారం సాయంత్రం అతడు రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

أحدث أقدم