సిడ్నీ: టీమ్‌ఇండియా జట్టులో గాయపడిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా చేరాడు. గాయంతో రాహుల్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ‘‘శనివారం మెల్‌బోర్న్‌లో టీమ్‌ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో రాహుల్ ఎడమచేతి మణికట్టు బెణికింది. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోడానికి మూడు వారాల సమయం పడుతుంది. మిగతా రెండు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉండడు’’ అని బీసీసీఐ పేర్కొంది. నెట్స్‌లో సహాయ సిబ్బంది నుంచి త్రోడౌన్‌లు ఎదుర్కొంటున్న సమయంలో గాయం కావడంతో వెంటనే అతడు ప్రాక్టీస్ ఆపేసి వెళ్లిపోయాడు. టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రాహుల్ మంగళవారం సిడ్నీ నుంచి భారత్‌కు పయనమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రాహుల్ చేరతాడు. ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడో లేదో చూడాలి.
రాహుల్‌కు గాయం.. సిరీస్‌కు దూరం
AMARAVATHI NEWS WORLD
0