ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన.. జమీర్‌ మృతి


ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన.. జమీర్‌ మృతి

హైదరాబాద్‌: ఇటీవల ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌(52) మృతిచెందాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 18న ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జమీర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ఆదిలాబాద్‌ తాటిగూడలో తుపాకీ, కత్తితో వారం రోజుల కిందట షారూఖ్‌ అహ్మాద్‌ వీరంగం సృష్టించాడు. పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌.. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడి చేశాడు. కాల్పుల ఘటనలో జమీర్‌, మోతేషాన్‌ గాయపడ్డారు. తల్వార్‌తో జరిపిన దాడిలో మన్నన్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. 

Post a Comment

أحدث أقدم