నంద్యాల సమీపంలో ట్రాక్టర్‌, బస్సు ఢీ

 

నంద్యాల సమీపంలో ట్రాక్టర్‌, బస్సు ఢీ 

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్‌ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ బోల్తా పడగా, బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ట్రాక్టర్‌, బస్సు డ్రైవర్లతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో చికిత్స అందించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Post a Comment

أحدث أقدم