హైదరాబాద్: పిల్లలతో పాటు రోడ్డుమీద వెళ్లేటపుడు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కన్నవారికి కడుపుకోత.. పిల్లలు జీవితాంతం వైకల్యంతో ఉండాల్సిన పరిస్థితులు రావొచ్చు. హైదరాబాద్ బాలానగర్ బీబీఆర్ ఆస్పత్రి సమీపంలో జరిగిన ప్రమాదం చూస్తే ఇలాంటి భయాందోళన కలగకమానదు.
తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న బాలుడు.. తల్లి చేయి వదిలి ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ద్విచక్ర వాహనదారుడు బాలుడిని గమనించలేదు. దీంతో బాలుడు కిందపడ్డాడు. వాహనదారుడు సైతం భయపడి వాహనాన్ని అదుపు చేయలేక కిందపడ్డాడు. అక్కడే ఉన్నవాళ్లంతా పరుగున వచ్చి బాలుడిని పైకి లేపారు. అదృష్టవశాత్తూ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు.