వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మోమిన్‌పేట : వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ,ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

                 వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం       వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


Post a Comment

أحدث أقدم