అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి


అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి

ఇల్లినాయిస్‌: అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి తన రెక్కలు విప్పింది. ఇల్లినాయిస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న డాన్‌ కార్టర్‌ లేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఓ అనుమానితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, దుండగుడు ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 

Post a Comment

أحدث أقدم