ఖమ్మంలో భాజపా నాయకుడి దారుణ హత్య


ఖమ్మంలో భాజపా నాయకుడి దారుణ హత్య

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన భాజపా నాయకుడు రామారావు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం పట్టణానికి చెందిన ఓ యువకుడు రామారావుపై కత్తితో దాడి చేశాడు. పాత బస్టాండ్ ప్రాంతంలోని భాజపా నేత ఇంటికి వెళ్లిన నిందితుడు కత్తితో నాలుగు సార్లు పొడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందనట్లు వైద్యులు తెలిపారు.

ఘటనాస్థలిని వైరా సీఐ వసంత్ కుమార్, ఎస్సై తిరుపతి రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Post a Comment

أحدث أقدم