కృష్ణా జిల్లాలో బస్సు బోల్తా: 35 మందికి గాయాలు


కృష్ణా జిల్లాలో బస్సు బోల్తా: 35 మందికి గాయాలు

కృష్ణా: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడడంతో 35 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Post a Comment

أحدث أقدم