తెలంగాణలో మావోయిస్టుల అలజడి..


తెలంగాణలో మావోయిస్టుల అలజడి

ఇంటర్నెట్‌డెస్క్‌:  తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. బడే చొక్కారావు ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం రాష్ట్రంలోకి చొరబడి సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 

ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న అటవీప్రాంతంలోనే ఎక్కువగా వీరి కదలికలు ఉన్నాయి. మావోయిస్టుల సంచరిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. అనుమానితుల ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి  మావోయిస్టుల కదలికలపై పోలీసు అధికారులతో చర్చించారు.

Post a Comment

أحدث أقدم