ANWtv:మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు

సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు. డబ్బులకోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ పరిధిలోని మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో (జనవరి 6న) శనివారం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును హైదరాబాద్‌ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) గురువారం ఛేదించారు.

గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును హైదరాబాద్‌ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) గురువారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. నిందితుడు మొబైల్‌ ఫోన్‌ కోసం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తిని చాదర్‌ఘాట్‌కు చెందిన దినసరి కూలీ మహ్మద్ సోహైల్ (24)గా గుర్తించారు. అతను 40 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితుడిపై హైదరాబాద్ సిటీ పోలీసుల వద్ద హిస్టరీ షీట్ ఉందని రైల్వే, రోడ్డు భద్రత ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు ఆ ఫోన్‌ను MGBSలో తెలియని వ్యక్తికి రూ.1, 700కి విక్రయించాడని.. డబ్బును అతని వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో అతనిపై కేసులు నమోదై ఉన్నాయని.. తెలిపారు.

Post a Comment

أحدث أقدم