ఈవారం ఓటీటీలు థియేటర్లలో చాలానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వారం వారం థియేటర్ల వద్జ ఎన్ని సినిమాలు విడుదల అయినా ఓటీటీల్లో చిత్రాలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే విషయం గుర్తించిన ఓటీటీ సంస్థలు సినిమాలు వెబ్ సిరీస్ లను వెంటనే వెంటనే విడుదల చేస్తూ.. అలరిస్తున్నాయి. అయితే తాజాగా మార్చి రెండో వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
నెట్ ఫ్లిక్స్ వేధికగా మార్చి 10వ తేదీన.. దగ్గుబాటి హీరోలు వెంకటేష్ రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడును రిలీజ్ చేయబోతున్నారు.
యాక్షన్ క్రైమ్ నేపథ్యంలో వస్తోంది ఈ వెబ్ సిరీస్. ఇందులో వెంకటేశ్ రానా తండ్రీ కొడుకులుగా నటించారు. అలాగే రేఖ ది గ్లోరీ2 అనే చిత్రాలు కూడా మార్చి 10వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
మరోవైపు హాట్ స్టార్ వేధికగా మార్చి 9వ తేదీ రోజు యాంగర్ టేల్స్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. కలర్ ఫొటో చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ లో బిందు మాధవితో పాటు సుహాస్ తరుణ్ భాస్కర్ డోన్నా సెబాస్టియన్ వెంకటేష్ మహా రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే చంగ్ కన్ చన్ రన్ బై రన్ అనే సినిమాలు మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
అలాగే మార్చి 10వ తేదీన బౌడి క్యాంటీన్ బొమ్మై నాగి చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మార్చి 10వ తేదీనే సోనీ లివ్ లో క్రిస్టి అనే మలయాళ చిత్రం రిలీజ్ కాబోతుంది. మాళవిక మోహనన్ మాత్యూ థామస్ హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రానికి అల్విన్ హెన్రీ దర్శకత్వం వహిస్తున్నారు.
రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10వ తేదీ నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం సమయం దొరికినప్పుడల్లా ఈ సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తూ ఎంజాయ్ చూసేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.