కాబోయే సతీమణి ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించాడు.తనకు కాబోయే సతీమణి భూమా మౌనికా రెడ్డి ఫొటోను శుక్రవారం ఉదయం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ''పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి'' అని పేర్కొన్నాడు. అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశాడు. దీనిని చూసిన సినీ ప్రియులు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మనోజ్‌కు 2015లోనే ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే అతడి వివాహం గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు బయటకు వచ్చాయి. కుటుంబానికి సన్నిహితురాలు, తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని అతడు పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ తాజాగా తనకు కాబోయే సతీమణిని పరిచయం చేశాడు. ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post