10 ముఖ్యంసలు..


1.ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మరోవైపు సీఎం జగన్‌ కాసేపట్లో ఏపీ  అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.

2. AP News: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై రైతుల హర్షం

మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మహాపాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేసింది. ఇన్నాళ్లూ అమరావతినే విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని.. 

3. ఆట లేదు.. మాట లేదు.. మమ్మల్ని ధిక్కరిస్తే మాయమే..!

చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించే వారిని చైనా అణచివేస్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా అసమ్మతిని అణగదొక్కడంలో భాగంగా అలాంటివారి ఆచూకీ లేకుండా చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంలో చైనాలో ప్రముఖుల మిస్సింగ్‌లు మిస్టరీగా మారుతున్నాయి. 

4. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాలి: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి వస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు  దర్శించుకున్నారు. 

5. రోహిత్‌ కూడా కప్పు తీసుకెళ్లి వాళ్లకే ఇచ్చాడు.. ధోనీ, కోహ్లీ లాగే..!

టీమ్‌ఇండియా టీ20 నూతన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి సిరీస్‌లోనే రాణించాడు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కెప్టెన్సీతో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో భారత్‌ గతేడాదిలాగే ఈసారి కూడా పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి చిత్తుగా ఓడించింది. అయితే, రోహిత్‌ మూడో టీ20లో విజయం సాధించాక ట్రోఫీ అందుకున్న అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌కు అందజేశాడు. 

6. Airtel: ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం.. ప్రీపెయిడ్‌ ఛార్జీల పెంపు

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్‌ ఛార్జీల(టారిఫ్‌)ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రవేశ టారిఫ్‌ వాయిస్‌ ప్లాన్‌లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది! 

7. మహిళలు నటించే షోలు ప్రసారం చేయొద్దు.. తాలిబన్ల హుకుం!

తాలిబన్ల కబంద హస్తాల్లో అఫ్గానిస్థాన్‌ వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అడుగడునా ఆంక్షలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే అక్కడ మహిళలపై కఠిన ఆంక్షలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీవీ షోలపైనా ఆంక్షలు విధించింది తాలిబన్‌ ప్రభుత్వం. మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

8. Pension: పెన్ష‌న్ కోసం జాయింట్ బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిసరికాదు..


జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంక్ ఖాతా తెర‌వ‌డం తప్పనిసరి కాదని కేంద్ర ప్ర‌భుత్వం పునరుద్ఘాటించింది. పెన్షన్ శాఖ సీనియర్ అధికారుల‌తో జ‌రిపిన‌ సమావేశం అనంతరం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త‌మ అనుభ‌వంతో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన‌వారితో పాటు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ "సౌల‌భ్యం" కోసం ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. 

9. India Corona: గతేడాది మే నాటి స్థాయికి తగ్గిన కేసులు..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 10వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి పడిపోయాయి. దాదాపు 538 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ప్రస్తుతం 7,83,567 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,488 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ తగ్గుదలకు పరీక్షల సంఖ్య కూడా కారణంగా కనిపిస్తోంది. మరోపక్క ఒక్క కేరళలోనే 5,080 మందికి కరోనా సోకింది. నిన్న 12,510 మంది కోలుకున్నారు. 

10. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

త వారంలాగానే ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో చూడండి! థియేటర్లలో: నవంబర్‌ 26న రాజ్‌తరుణ్‌ ‘అనుభవించు రాజా’, సంపూర్ణేష్‌ బాబు ‘క్యాలీఫ్లవర్‌’, ‘1997’, ‘పీకే’గా  షకలక శంకర్‌, ‘ఆశా ఎన్‌కౌంటర్‌’, సల్మాన్‌ఖాన్‌  ‘అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌’. నవంబర్‌ 25న శింబు  ‘ది లూప్‌’, జాన్‌ అబ్రహం ‘సత్యమేవ జయతే 2’ విడుదలకానున్నాయి.

Post a Comment

Previous Post Next Post