అమరావతి: మూడు రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతం, మహాపాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. 3 రాజధానులు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని.. మహాపాదయాత్ర కొనసాగుతుందని ఐకాస వెల్లడించింది. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని అమరావతి ఐకాస స్పష్టం చేసింది
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతుల హర్షం
AMARAVATHI NEWS WORLD
0