మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సోమవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో రాజధాని రైతుల దీక్షా శిబిరాల్లో ఆనందం వెల్లి విరిసింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని 700 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు బిల్లు రద్దు విషయం తెలియగానే మిఠాయిలు పంచుకున్నారు. అయితే... ఎలాంటి ఇబ్బందులు, చిక్కులు ఎదురుకాకుండా మళ్లీ వికేంద్రీకరణ బిల్లుని శాసనసభలో మరోసారి ప్రవేశపెడతామని..
2. ఎక్కడికంటే అక్కడికి రాలేం..
క్యాబ్ బుక్ చేసుకుంటే చాలు ఎక్కడికైనా ఇట్టే వెళ్లిపోవచ్చనే భరోసా ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. యాప్ ద్వారా బుక్ చేస్తే... కాసేపటికే ‘సర్ ఎక్కడికి వెళ్లాలి?’ అంటూ డ్రైవర్ నుంచి ఫోన్ కాల్. వెళ్లాల్సిన ప్రాంతం చెప్పాక క్యాబ్ వస్తుందో, క్యాన్సిల్ అవుతుందో తెలియదు. హైదరాబాద్‌లోనే నిత్యం 20-25 వేల రైడ్లు రద్దవుతున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ నగరాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి.
3. నువ్వొస్తానంటే.. నేను రానిస్తానా!
లక్షలు సంపాదించే ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. తమ కుమార్తె సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవాస వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతుంటారు. కోరినన్ని లాంఛనాలిచ్చి అట్టహాసంగా వివాహం చేస్తారు. అయితే, మూడుముళ్లు పడ్డాక కాపురానికి వెళ్లే విషయంలో కొందరికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనలతో పలువురు ఆగిపోతుండగా.. అల్లుళ్ల మోసాలతో మరికొందరు పుట్టింటికే పరిమితం అవుతున్నారు.
4. Rohit Sharma: సారథీ.. సాగిపో..!
టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్ గెలిచి పదేళ్లు దాటిపోయింది.. అదే టీ20 ప్రపంచకప్ అయితే ఏకంగా 14 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో కప్పును ముద్దాడలేకపోయింది. ఈ ఏడాది పొట్టి కప్పును పట్టేస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఇక అందరి చూపు 2022 టీ20 ప్రపంచకప్‌పై పడింది. ఇప్పుడు ఆశలన్నీ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మపైనే. ఆ దిశగా సారథిగా తొలి సిరీస్‌లోనే క్లీన్‌స్వీప్ విజయాన్ని అందించిన అతను.. నాయకత్వంతో ఆకట్టుకున్నాడు.
5. ‘ఎఫ్3’ ఎప్పుడొస్తే అప్పుడే పండగ
దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత హుషారుగా కనిపిస్తాడో... ఆయన సినిమాలు ప్రేక్షకులకు అంతే ఉత్సాహాన్ని పంచుతాయి. ఆయన కథలు, అందులోని పాత్రలు ప్రతి ఒక్కరికీ ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. కడుపుబ్బా నవ్విస్తాయి, బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న అనిల్... తన మార్క్ ఫన్, ఫ్రస్టేషన్‌ని మరోసారి మేళవిస్తూ ‘ఎఫ్3’ని తెరకెక్కిస్తున్నారు.
6. ఎవరి డేటానైనా సర్కారు తీసుకోవచ్చు
వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై నివేదికకు సోమవారం సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేసీపీ) విపక్షాల అసమ్మతి నడుమ ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనం చేసింది. దేశ భద్రత తదితర సందర్భాల్లో ఏ వ్యక్తి నుంచీ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలైన పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీలతో పాటు ఆధార్ కార్డులు ఇచ్చే ఉడాయ్..
7. దుస్తులు.. టీవీ.. సెల్‌ఫోన్.. అన్నీ ప్రియమే!
టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు వచ్చే నెలలోగా 5-6 శాతం మేర పెరగొచ్చు. జనవరి-ఫిబ్రవరిలో మరో సారి పెంపు ఉండొచ్చు. వీటి ముడి పదార్థాల ధరలు 10-12 శాతం పెరగడం ఇందుకు నేపథ్యం. దుస్తుల ఎగుమతిదార్లు కూడా పెద్ద బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నారు. అధిక వ్యయాలను వినియోగదార్లకు బదిలీ చేయాలంటున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం కారణంగా ఉత్పత్తి, సరఫరా విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి.
8. కాలేయ మేహం
మధుమేహంపై మన ఆలోచనా ధోరణి మారుతోంది. ఇన్నాళ్లూ మధుమేహానికి మూలం క్లోమగ్రంథే అనుకుంటున్నాం. నిజానికి కాలేయమే అసలు సిసలు కారణమనే భావన పుంజుకుంటోంది. కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్) వల్ల గ్లూకోజు స్థాయులు పెరుగుతుండటం.. కొవ్వు తగ్గితే గ్లూకోజు అదుపులోకి వస్తుండటం పరిశోధకులనూ ఆలోచింపజేస్తోంది. మధుమేహం, ఫ్యాటీ లివర్ రెండూ కలిస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
9. Disha Case: ‘దిశ నిందితుల్లో మైనర్లు లేరు’
దిశ నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్ కోటా పేర్కొన్నారు. వారికి సంబంధించిన రికార్డులు అన్నింటిలోనూ మేజర్లే అని ఉన్నట్లు వెల్లడించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ ఎదుట సోమవారం ఆయన వాదనలు వినిపించారు. వారు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.
10. ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ విడిపోతున్నారా..?
బీటౌన్‌లో మరో సంచలన వార్త. గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా, తన భర్త పాప్ సింగర్ నిక్ జొనాస్ విడిపోతున్నారా? ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి కారణం ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ నుంచి తన భర్త ఇంటి పేరు జొనాస్ పేరును తొలగించడమే. ప్రియాంక చోప్రా తాజాగా తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ‘చోప్రా జొనాస్’ పేరును తొలగించింది.