ధ్రువపత్రాలు వెంట లేకుండానే పాస్‌పోర్టు!


ధ్రువపత్రాలు వెంట లేకుండానే పాస్‌పోర్టు!


 హైదరాబాద్‌: పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశారా? అయితే ధ్రువీకరణ పత్రాల పరిశీలన రోజు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపుకార్డు వంటివి వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) గురువారం తెలిపింది. దరఖాస్తు సమయంలో ‘డిజి లాకర్‌’లో భద్రపర్చిన ఈ-పత్రాలు సరిపోతాయని వివరించింది. ముందుగా డిజి లాకర్‌లో ఖాతాను తెరవాలని, ఆ తర్వాత పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసే సమయంలో ‘ఫెచ్‌ ఫ్రం డిజిలాకర్‌’ను క్లిక్‌ చేసి ధ్రువపత్రాలను జతచేయవచ్చని పీఐబీ సూచించింది.

Post a Comment

أحدث أقدم