వింత షార్క్‌ పిల్ల


వింత షార్క్‌ పిల్ల

జకార్తా : షార్క్‌ కడుపులోని పూర్తిగా ఎదగని పిల్ల ఓ మత్స్యకారుడ్ని సెలెబ్రిటీని చేసింది. వింత ఆకారంలో ఉన్న ఆ షార్క్‌ పిల్ల తనను అదృష్టవంతుడ్ని చేస్తుందన్న నమ్మకంతో దాన్ని అమ్మకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అబ్ధుల్లా నురెన్‌ అనే వ్యక్తి ఫిబ్రవరి 21వ తేదీ చేపలు పట్టడానికి ఈస్ట్‌ నుసా టెంగ్గరలోని రోట్‌ న్డాడోకు వెళ్లాడు. చేపలకోసం వల విసరగా అందులో ఓ షార్క్‌ పడింది. మరుసటి రోజు షార్క్‌ పొట్టను కోసి చూడగా అందులో రెండు షార్క్‌ పిల్లలు మరో వింత జంతువు కనిపించింది. అది ఏంటో తెలియక తికమకకు గురయ్యాడు అబ్ధుల్లా. ముఖం ఏలియన్‌లాగా, కింద కొంత శరీరం మత్స్య కన్యలాగా.. మిగిలిన కింద భాగం చేపలాగా ఉంది. అది పూర్తిగా ఎదగని షార్క్‌ పిల్ల అని తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది.

తర్వాత ఆ వింత షార్క్‌ పిల్లను ఇంటికి తీసుకెళ్లాడు. షార్క్‌ విషయం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీనిపై అబ్ధుల్లా మాట్లాడుతూ.. ‘‘షార్క్‌ పిల్లను చూడటానికి వచ్చే జనంతో మా ఇళ్లు కిక్కిరిసిపోయింది. చాలా మంది దాన్ని కొనుక్కుంటామని అడుగుతున్నారు. నేను అమ్మకుండా దాచుకోవాలనుకుంటున్నాను. అది నాకు అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నాడు.

Post a Comment

Previous Post Next Post