బెంగాల్‌ రాయ్‌ నాని

 

 కథానాయకుడు నాని జోరుమీదున్నారు. ‘టక్‌ జగదీష్‌’తో త్వరలోనే సందడి చేయనున్న ఆయన, ఇటీవలే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్లోనే బిజీ బిజీగా గడుపుతున్నారు నాని. బుధవారం ఆయన పుట్టినరోజు.  ఈ సందర్భంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. వెంకట్‌ ఎస్‌.బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో నాని బెంగాలీ యువకుడిగా కనిపించారు.  ‘‘ఒక విలక్షణ కథతో, పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న’’ని సినీ వర్గాలు తెలిపాయి.

బెంగాల్‌ రాయ్‌


.

Post a Comment

Previous Post Next Post