షర్మిల కొత్తపార్టీ రేపే ముహూర్తం


షర్మిల నివాసం వద్ద అభిమానుల కోలాహలం


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ అభిమానులారా తరలి రండి.. అని  గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్‌ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్‌ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై షర్మిల నిర్ణయం తీసుకుని, ఆత్మీయ సమ్మేళనం వివరాలు వారితో పంచుకోనున్నారు.

Post a Comment

أحدث أقدم