
అమరావతి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా అమరావతిలోని ధ్యానబుద్ధ పుష్కర స్నాన ఘాట్‌లో దేవుడి విగ్రహం భాగాలు పడేసి ఉండటం సంచలనం కలిగించింది. విగ్రహాన్ని దుండగులు ముక్కలు చేసి ఘాట్‌లో చెల్లాచెదురుగా పడేశారు. ఆనవాళ్లు కనిపించకుండా కాల్చే ప్రయత్నం చేశారు. శిరస్సు భాగం మాత్రం ఆ ప్రాంతంలో కనిపించ లేదు. విగ్రహాన్ని ఎక్కడ నుంచి ఇక్కడకు తరలించారు...అది ఏ దేవుడిది అన్న దానిపై స్పష్టత లేదు. విషయం తెలుసుకున్న అమరావతి పోలీసులు ఘాట్ వద్దకు చేరుకొని ... విగ్రహం భాగాలను గోనెసంచిలో తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు.