ఇబ్రహీంపట్నం గ్రామీణ, న్యూస్‌టుడే: నీలి చిత్రాలు చూపిస్తూ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోచారం గ్రామంలో జరిగింది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి పోచారం గ్రామానికి చెందిన కొర్రమోని దానయ్య(55) తన ఎదురింట్లో ఉన్న ఏడేళ్ల చిన్నారిని తన ఇంట్లోకి పిలిచి చరవాణిలో ఆశ్లీల దృశ్యాలను చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయాందోళనలతో చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దానయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నారి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సైదులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చరవాణిలో నీలి చిత్రాలు చూపిస్తూ చిన్నారిపై అత్యాచారం
AMARAVATHI NEWS WORLD
0