లంగావోణిలో 'ఫిదా' చేస్తున్న సాయిప‌ల్ల‌వి న్యూ లుక్

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిప‌ల్ల‌వి. అందం, అభిన‌యం, డ్యాన్స్..ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ అద్భుత‌మైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న విరాట‌ప‌ర్వం చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిప‌ల్ల‌వి లుక్ ఒక‌టి విడుద‌ల చేయ‌గా అది నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రెండు జ‌డ‌లు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిప‌ల్ల‌వి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అంద‌రి మ‌న‌సు దోచేస్తోంది.

ఫిదా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ గ్రామీణ యువ‌తి లుక్‌లో మెరుస్తోంది సాయిప‌ల్ల‌వి. 1990ల బ్యాక్ డ్రాప్ లో క‌థ సాగ‌నుండ‌గా..సాయిప‌ల్ల‌వి కూడా అప్ప‌టి నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మేకోవ‌ర్ మార్చుకున్న‌ట్టు లేటెస్ట్ స్టిల్ చూస్తే తెలిసిపోతుంది. ఎస్ఎల్ వీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంద‌. రానా లీడ్ రోల్ లో న‌టిస్తుండ‌గా..ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఏప్రిల్ 30న సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Post a Comment

أحدث أقدم