అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..!


అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..!

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశాపటాని, కండల వీరుడు టైగర్‌ష్రాఫ్‌ ప్రేమలో విహరిస్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు  తెగ వినిపిస్తున్నాయి. అయితే.. ప్రేమవ్యవహారంపై ఇప్పటి వరకూ వీళ్ల స్పందించలేదు. కాగా.. బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ ఈ ప్రేమజంట విషయంలో ఓ క్లూ ఇచ్చారు. ఆయన ఇటీవల కపిల్‌శర్మ చాట్‌లో పాల్గొన్నారు. మీకు అవకాశం వస్తే ఏ బాలీవుడ్‌ నటుడి ఆహారం దొంగిలించాలని అనుకుంటున్నారు..? అని అనిల్‌కపూర్‌ను కపిల్‌శర్మ ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. టైగర్‌ష్రాఫ్‌ ఏం తింటున్నాడో తెలుసుకొని ఆ ఆహారాన్ని దొంగిలించాలనుకుంటున్నట్లు అనిల్‌కపూర్‌ చెప్పాడు. అయితే.. ‘మలంగ్‌’ సినిమాలో అనిల్‌కపూర్‌.. దిశా పటానితో కలిసి పనిచేశారు. ఆ సమయంలో ఒకసారి ఆమె ఆహారాన్ని దొంగిలించినట్లు చెప్పడం గమనార్హం. తాజాగా ష్రాఫ్‌ గురించి ప్రస్తావించడంతో ప్రేమ పుకార్లకు బలం చేకూరింది. ఇలా వాళ్లిద్దరి ప్రేమలో ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పేశారు.

కాగా.. ప్రేమ వ్యవహారంపై ఈ జంట ఇప్పటికీ నోరు విప్పలేదు. అయితే.. పలుమార్లు ఇద్దరూ కలిసి పార్టీలు.. ఇతర కార్యక్రమాలకు వెళ్లిన దశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీళ్లిద్దరూ కలిసి ‘బాఘీ 2’లో కలిసి పనిచేశారు. ఆ సినిమా మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రశంసలైతే వచ్చాయి. దిశా తన తర్వాతి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తోంది. ఆమె ‘రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో కనిపించనుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు ఆమె పచ్చజెండా ఊపింది

Post a Comment

أحدث أقدم