తెల్లారితే పెళ్లి..పెళ్లికుమారుడు మాయం


తెల్లారితే పెళ్లి..పెళ్లికుమారుడు మాయం

చిక్కమగళూరు‌: తెల్లారితే పెళ్లి.. అప్పటి వరకు విందులో కలియతిరిగాడు పెళ్లికుమారుడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. పొద్దునే వివాహం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురుని మనువాడేందుకు మరో నవవరుడు ముందు కొచ్చాడు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులోని తారికారే తాలుకాలో జరిగింది. సింధు, నవీన్‌ అనే యువతీయువకులకు పెద్దలు వివాహం నిశ్చయించి ఏర్పాట్లు చేశారు. అయితే నవీన్‌ వేరే యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి ఆపేస్తానని ఆ యువతి హెచ్చరించడం వల్లే నవీన్‌ పారిపోయాడని సమాచారం. ఇక.. తెల్లవారితే పెళ్లి అని ఎన్నో ఆశలతో ఉన్న సింధు జీవితం ఏమవుతుందో అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి బాధను అర్థం చేసుకున్న చంద్రు అనే వ్యక్తి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు. చంద్రు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.

Post a Comment

أحدث أقدم