కేంధ్ర ప్రభుత్వం తీసుక వచ్చిన 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదపూ 38 రోజులుగా దేశంలో రైతాంగ చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన....
భారతదేశ ఆరిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది 1960లోప్రవేశపెట్టబడిన హరిత విప్లవం ఈ సంక్షోభానికి నాంది పలికింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిన కాంగ్రెస్ తోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలు అనుసరించిన సామ్రాజ్యవాద అనుకూల విధానాలనే మోడీ ప్రభుత్వం నేడు మరింత వేగంగా, క్రూరంగా అమలు చేయటం వల్లనే ఈ వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్ర స్థాయికి చేరుకున్న ది.
1991లో దేశంలో ప్రవేశ పెట్టబడిన నూతన ఆర్థిక విధానాలు (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ) కార్పోరేటు, మార్కెట్ శక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పాయి. 1995 లో ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) ఏర్పడిన తర్వాత దానితో భారత దళారీ పాలకులు కుదుర్చుకున్న ఒప్పందాల వలన ప్రభుత్వ రంగ ఆజమాయిషీ గల దేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో దేశ, విదేశీ కార్పోరేటు సంస్థల ఆజమాయిషీ ముందుకొచ్చింది. WTO పై ఆధిపత్యం ఉన్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు విధించిన షరతులకు తల ఒగ్గి దేశంలో వ్యవసాయ రంగానికి రాను రానూ రయితీలను తగ్గించేస్తున్నారు. మరో వైపు ఎరువుల ధరలు, నీటి పన్ను, కరెంటు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్టు పంటల రేట్లు మాత్రం పెరగడం లేదు.
ఈ నేపథ్యంలో WTO నిబందనలకు అనుగుణంగా వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేసే పనిలో మోడీ ప్రభుత్వ నిమగ్నమైంది. దేశంలోని మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసి రైతులను తమ భూముల్లోనే కూలీలుగా మార్చే కుట్రకు తెరతీసింది. 3 వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను తమ భూములనుండి బేదఖలు చేసి అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు సిద్దమయ్యింది.
కేంద్ర ప్రభుత్వం పాలపడుతున్న కుట్రను గ్రహించిన దేశ రైతాంగం ప్రస్తుతం అలుపెరగని పోరాటం చేస్తోంది. రైతాంగం చేస్తోన్న ఈ పోరాటానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తోంది. దాంతో మోడీ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపింది.
బీజేపీ, ఆరెస్సెస్ వాటి ఐటీ సెల్ లు రైతులపై సోషల్ మీడియాలో మీడియాలో దుర్మార్గమైన అబద్దపు ప్రచారానికి తెగించాయి. రైతుల ఉద్యమంలో చైనా, పాకిస్తాన్ హస్తమున్నదని, ఉగ్రవాదులున్నారని..ఇలా రకరకాల ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయని రైతులు పోరాటాన్ని ముందుకు నడిపించడమే కాక, దేశంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా విజయం సాధించారు.
ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల దాడులను ఎదుర్కొంటూ రైతులు చేస్తున్న సమరశీల పోరాటానికి మా పార్టీ AOBSZC సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. ఆత్మహత్యలు, బలిదానాలతో ఇప్పటి వరకు ప్రాణాలర్పించిన 40 మందికి పైగా రైతులకు నివాళులర్పిస్తున్నాము. వారి కుటుంబసభ్యులకు, బందు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ప్రియమైన రైతులారా ! ప్రజలారా!
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.
సామ్రాజ్యవాదానికి దాస్యం చేస్తున్న భారత బడా బూర్జునా, భూస్వామ్య వర్గాలను , వారు సంరక్షిస్తున్న అర్థ వలస, అర్థ భూస్యామ్య వ్యవస్థను కూలదోసి దేశంలో ధీర్ఘకాల ప్రజాయుద్ద పంథాలో వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం తప్ప ఈ వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి వేరే దారి లేదు.
దున్నేవారికే భూమి, విప్లవ ప్రజా కమిటీలకే సర్వాధికారాలు లభించే వరకు, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. రైతాంగం ఎన్ని ఆటు పోట్లు, ఆటంకాలు, ఎగుడు దిగుళ్ళు ఎదురైనా నూతన ప్రజాస్వామిక భారత దేశాన్ని స్థాపించడంలో భాగంగా తమ విప్లవ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకునే వైపు దృఢంగా ముందుకు సాగాలని కోరుతున్నాం.
విప్లవాభినందనలతో
గణేష్,
కార్యదర్శి,
ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC)
CPI మావోయిస్టు