హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేని.. సునీత మెడలో మూడుముళ్లు వేశారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత- రామ్‌ల వివాహం జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. పెళ్లిమండపంలో భర్త రామ్ వీరపనేనితో కలిసి దిగిన ఫొటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.