ఆపరేషన్ ‘బెంగాల్’ దీదీ పరేషాన్
బెంగాల్ దంగల్‌లో దీదీని ఓడించడమే లక్ష్యంగా కమలదళం ఓ వైపు వ్యూహాలు రచిస్తుంటే, బిహార్ తరహాలో బెంగాల్‌లో బోణీ కొట్టేందుకు ముస్లిం ఓట్లను ఏకం చేసే పనిలో ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్–ఇ–ఇత్తెహద్– ఉల్–ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు.
ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు
ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది.
నాపై విష ప్రయోగం జరిగింది : ఇస్రో శాస్త్రవేత్త
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఫేస్‌బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోలో కలకలం రేపుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనా
దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ బ్రిటన్ స్ట్రెయిన్ కంటే డేంజర్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
శత్రువుల మధ్య చిగురించిన స్నేహం!
సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు.
చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా అవుకు చేరుకొని.. కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు నాలుగు మాసాల తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయనకు తూముకుంటలో ఊహించని పరిణామం ఎదురైంది.
బర్డ్ ప్లూ: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది'
ఆసీస్‌తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ బుధవారం ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ట్విటర్ వేదికగా టీమిండియాకు తన సందేశాన్ని అందించాడు.
రిలయన్స్, ఐటీసీ దెబ్బ : బుల్ రన్‌కు బ్రేక్
దేశీయ స్టాక్‌మార్కెట్లో బుల్ రన్‌కు బ్రేక్ పడింది. గత పదిరోజులుగా లాభాలతో మురిపిస్తున్న సూచీలు కొత్త ఏడాదిలో తొలిసారిగా నేడు(బుధవారం) విరామం తీసుకున్నాయి
సలార్: ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.