విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం


విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

విశాఖ: విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి మూడు సార్లు పేలుళ్లు  చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులు ఉన్నారు. అయితే పేలుడు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. 

Post a Comment

أحدث أقدم