ఫిబ్రవరి 12న కాజల్‌ ‘ప్రత్యక్ష ప్రసారం


వెండితెరపై స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16ఏళ్లు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారామె. ఇప్పటివరకూ బిగ్‌ స్క్రీన్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాజల్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ (ప్రత్యక్ష ప్రసారం) ఫిబ్రవరి 12 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వీఐపీలో ప్రీమియర్‌ కానుంది. వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు చేశారు. సస్పెన్స్, హారర్‌ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. థ్రిల్లర్‌ జోనర్‌లో కాజల్‌ నటించడం ఇదే తొలిసారి. 

 



Post a Comment

Previous Post Next Post