అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : కుమారుడి పేరును కార్డులో చేర్చమని కోరితే.. ఏకంగా బియ్యం కార్డునే మంజూరు చేశారు రెవెన్యూ శాఖ అధికారులు. ఈ సంఘటన అవనిగడ్డ మండలంలో వెలుగుచూసింది. పాత ఎడ్లంక గ్రామానికి చెందిన మైలా నాగరాజు-మాధవి దంపతుల కుమారుడు ఓంకారశ్రీ. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ కుమారుడి పేరును రేషన్ కార్డులో నమోదు చేయాలని గ్రామ వాలంటీరుకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల తరువాత బాలుడి పేరుతో రేషన్ కార్డును ఆ వాలంటీరు వారికి అందజేశారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో కరోనా సాయంగా రూ.1000తోపాటు బియ్యం కూడా బాలుడికి మంజూరయ్యాయి. వాటిని ఆ కుటుంబ సభ్యులు తీసుకోలేదు. తమ కార్డులో పేరు చేర్చమని పులిగడ్డ సచివాలయ సిబ్బందికి అర్జీ పెట్టినా స్పందించలేదు. పాఠశాలలో అమ్మఒడి పథకానికి తమ కుమారుడిని అనర్హుడిగా పేర్కొనడంతో మీడియా దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఏడేళ్ల బాలుడికి బియ్యం కార్డు
AMARAVATHI NEWS WORLD
0