గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధాకర్ (22) గల్లంతయ్యారు. గల్లంతైన సుధాకర్‌ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం లక్నవరం చేరుకున్నారు. సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడి గల్లంతయ్యారు. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేకపోయారు. స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
లక్నవరం చెరువులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు
AMARAVATHI NEWS WORLD
0