పెట్రోలు లీకై మంటలు..ఇద్దరు సజీవ దహనం


అనంతపురం జిల్లాలో ఘటన

పెట్రోలు లీకై మంటలు..ఇద్దరు సజీవ దహనం

గుత్తి: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనానికి సంబంధించిన పెట్రోల్‌ ట్యాంకు లీకై మంటలు వ్యాపించడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం బోగలకట్టకు చెందిన రోశిరెడ్డి(65), నారాయణరెడ్డి(45) గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి గ్రామానికి వస్తుండగా గుత్తి మండలం ఎంగిలిబండ-కొత్తపేట మధ్య ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదం తీవ్రతకు ద్విచక్ర వాహనంలోని పెట్రోలు బయటికి వచ్చేసింది. వెంటనే మంటలు చెలరేగి రోశిరెడ్డి, నారాయణరెడ్డికి అంటుకున్నాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో లారీ సైతం పాక్షికంగా, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనఫై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోలు లీకై మంటలు..ఇద్దరు సజీవ దహనం


Post a Comment

أحدث أقدم